ధర్మవరం వైయస్సార్ సిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి మంగళవారం దర్శిలోని దర్శి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని ఆయన గృహంలో లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై కాసేపు ముచ్చటించుకున్నారు. దర్శి నియోజక వర్గంలోని వైయస్సార్ సీపీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద, బడుగు, బలహీన వర్గాలవారు మద్దతుగా నిలిచారని బూచేపల్లి వివరించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. బూచేపల్లి కుటుంబానికి అండగా నిలిచి, బూచేపల్లి ని గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ తో సోషల్ మీడియా ద్వారా ప్రసిద్ధి చెందిన కేతిరెడ్డి తో పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు ఫోటోలు సెల్ఫీలు ఉత్సాహంగా తీసుకున్నారు.

