పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి -దర్శి సీఐ షేక్ షమీఉల్లా

తాళ్లూరు మండలంలో పెండిం గ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని దర్శి సీఐ షేక్ షమీఉల్లా తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్థానిక పోలీసుస్టేషన్ ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. ఈ సంద ర్భంగా సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా మండలంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయాలన్నారు. అసాంఘిక కార్యాకలా పాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. సిబ్బంది సమన్వయంతో పని చేయాలనిసూచించారు. ఆయన వెంట ఎస్ఐ వైవీ రమణయ్య, ఏఎస్ఐ ఐ మోహనరావు, సిబ్బంది బ్రహ్మనాయుడు, రాముడు, అంజిబాబు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *