దివంగత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పాలన వరకు బీసీ వర్గాలకు పాలనలో, పదవుల్లో స ముచిత గౌరవంఇచ్చిన ఘనత టీడీపీకే దక్కిందని ఆ పా ర్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ అన్నారు. తాళ్లూరు లో ఎన్టీఆర్ విగ్రహం సమీపాన మండల టీడీపీబీసీ సెల్ అధ్యక్షుడు పిన్నిక రమేష్ బాబు అధ్యక్షతన బుధవారం జరిగిన జయహో బీసీ సదస్సులో నియోజకవర్గ నేత గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో బీసీలకు ఆదరణ తగ్గిందన్నారు. ముందుగా రజానగరం రోడ్డు నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం సభాప్రాగంణం వద్ద ఉన్న కలామ్, మథరెరిస్సా, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలుల వేసి నివాళులు అర్పించారు. సభా వేదికపై పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు బొ మ్మిరెడ్డిఓబుల్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు కూటాల ప్రసాద్, నేతలు, రాష్ట్ర, జిల్లా, మండల పలు బాధ్యులు మానం రమేష్ బాబు, షేక్ కాలేషావలి, షేక్ కాశీంసైదా,జి.వేణుబాబు,పాశం సూరిబాబు (పెద్దన్న), వంగపల్లి నాగేశ్వరరావు, బూచిరాజు, సిహెచ్.నాగేశ్వరరావు, రావినూతల పరిశుద్దరావు, మీరామొహిద్దీన్, చెన్నపురెడ్డి వీరనాగిరెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, తూము శివనాగిరెడ్డి, ఐ.శ్రీనివాసరెడ్డి,కె.రామకోటిరెడ్డి, మాగంటి శ్రీనివాసరావు, జె. పోతురాజు జి. లక్ష్మీనారాయణ, అనపర్తి సుబ్బారావు, కె.రామయ్య, ఎఫ్రాయిమ్, రాచకొండ వెంకట్రావు, నుసుం ఆదినారాయణరెడ్డి, పాలెపోగు దాసు, కె.నాగార్జునరెడ్డి,షేక్ అన్వర్ బాషా, స్వామిదాసు, జి.నర్సి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
