సనత్ నగర్ నియోజక వర్గ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులుగా త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ ను నియమితులైనారు. తనను నియోజక వర్గ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ (ఎ) బ్లాక్ అధ్యక్షునిగా నియమించినందుకు పిసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ,సికింద్రా బాద్ జిల్లా అధ్యక్షుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజక వర్గ ఇన్చార్జి కోట నీలిమకు మనోజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజక వర్గంలోని వివిధ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ మరింత పటిష్టతకు కార్యకర్తలతో అందరితో కలిసి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాలను అర్హలైన ప్రతి ఒక్కరికి అందేలా తగిన కృషి చేస్తానని అన్నారు.
