యాత్ర సినిమా రిలీజ్ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కుటుంబ సభ్యులు నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం యాత్ర మార్నింగ్ షో చూశారు. తామొక్కరే కాకుండా నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి బూచేపల్లి కుటుంబ సభ్యులు సినిమా చూశారు. అందరితో కలిసి సినిమా చూడటం ఆనందంగా ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, డాక్టర్ శివప్రసాదరెడ్డిలు పేర్కొన్నారు. నియో జకవర్గ కార్యకర్తలు, అభిమానుల కోసం రెండు సినిమా హాళ్లలో సినిమాను ఉచితంగా అందరు చూసేలా చర్యలు తీసుకున్నారు. నియోజవర్గంలోని అన్ని మండలాల నుండి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బూచేపల్లి నందిని, కె.రమణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి,
మండల ఉపాధ్యక్షుడు సోము దుర్గారెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, 1,5,7,8, వార్డు కౌన్సిలర్లు జగన్నాథం మోహన బాబు, బాబు, ఆవుల శివారెడ్డి, మేడగం మోహన రెడ్డి, కపురం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవ దానం, ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు బండి గోపాల్ర రెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి, కొల్లా ఉదయభాస్కర్, రాచపూడి భాస్కర్, ఎన్వీ నాగిరెడ్డి, కురిచేడు జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, నారు శ్రీనివాసరెడ్డి, గోగులముడి లింగారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభి మానులు పాల్గొన్నారు.


