మాయమాటల మాంత్రికుడు బాబు -జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి – యాత్ర 2 సినిమా కాదు.. జగన్ మోహన్ రెడ్డి వీర పోరాట చరిత్ర -పసుపుగల్లు, చింతలపూడి గ్రామాల్లో మన ఊరికి.. మన శివన్న ఎన్నికల ప్రచారం

మాయమాటలు మాంత్రికుడు చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోవద్దని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు పంచాయితీ లో గురువారం రాత్రి మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచార కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైఎస్సార్ విగ్రహా లకు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ముందుగా స్థానిక ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బూచేప ల్లి కుటుంబ సభ్యులు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకా యమ్మ, దర్శి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శివప్రసాదరెడ్డి, నందిని లకు అడుగడుగునా మహిళలు పూల వర్షం కురిపిస్తూ ప్రచారంలో వెన్నంటి నిలిచారు. ప్రచార రథం పై జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ, డాక్టర్ శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు వైఎస్సార్సీపీ జెండా అండగా ఉంటుంద న్నారు. మీ చిరునవ్వుల్లో జగనన్న అభి మానం కనిపిస్తుందన్నారు. పేద, నిరుపే దల అభ్యున్నతి కోసం పాటుపడే దేశంలోనే దమ్మున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న మాట ఇస్తే అది శిలాశాసనమేనని తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాడే జగనన్న అందుకు నిదర్శనంగా విజయవాడ నడి బొడ్డున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 215 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి దళితుల, బీసీల పక్షపాతిగానిరూపించుకున్నారన్నారు. నవరత్నాల నగదు మహిళల బ్యాంకు ఖాతాలకు జమ కావాలంటే జగనన్న మరలా సీఎం కావా లన్నారు. మన ఊరు మన శివన్న, మన పసుపుగల్లు కార్యక్రమంలో తన బిడ్డ శివప్ర సాదరెడ్డి, జగనన్న ఆశీస్సులతో మరో సారి మీ ముందుకు వస్తున్నాడని గెలిపించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ కోరారు. దర్శిలో శివప్రసాద రెడ్డి గెలిస్తే.. జగనన్న ముఖ్యమంత్రి
అయినట్టేనన్నారు. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నేడు జగనన్న రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు భరోసా. పంటల బీమాతో లక్షల రూపాయలు నేరుగా రైతు ఖాతాల్లో జమచేసి వారికి అండగా నిలిచారన్నారు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు మాత్రమేనన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన చంద్ర బాబు నేడు వారి ఓట్ల కోసం మాయమా టలతో మీ ముందుకు వస్తే తగిన గుణ పాఠం చెప్పాలన్నారు. డ్వాక్రా రుణ మాఫీ హామీకి తూట్లు పొడిచిన చంద్రబాబను మహిళలు నమ్మి మరోసారి మోసపోవద్ద న్నారు. ఎస్సీ కాలనీకి చెందిన వరగాని నాగే శ్వరరావు కుమారుడు నాగరాజు ప్రమాదం లో గాయపడగా అతనిని పరామర్శించారు.
ఎంపీపీ సుంకర సునీతాబ్రహ్మారెడ్డి, జెడ్పీ టీసీ తాతపూడి రత్నరాజు, వైస్ఎంపీపీ బం కా రమణమ్మనాగిరెడ్డి, సర్పంచ్ ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు చింతా శ్రీనివాస రెడ్డి, మండల మాజీ కన్వీనర్ సూదిదేవర అంజయ్య, జిల్లా యూత్ కార్యదర్శి గర్నె పూడి ప్రసన్నకుమార్, ఉపసర్పంచ్ బిజ్జం జ్యోతికృష్ణారెడ్డి, నాయకులు మారం శ్రీని వాసరెడ్డి, అంజిరెడ్డి, బిజ్జం రమణారెడ్డి, బాలకోటిరెడ్డి, జాన్, దాసరి ఎలీషా, దామా శ్రీను, గూడాల లింగారెడ్డి, వరగాని అబ్రహం, మేకల వెంకటేశ్వరరెడ్డి, కైపు వెం కటేశ్వరరెడ్డి, మదార్వలి, మేదరమెట్ల కోదండరామయ్య, అంజిరెడ్డి, కొండా రెడ్డి, మందలపు అశోక్, భిక్షాలు రెడ్డి, మేడగం రమణారెడ్డి, గొంది వెంకటప్పారెడ్డి, పాలడుగు చిరంజీవి, కావూరి రామయ్య, తాతపూడి దేవయ్య, మాజీ ఎంపీటీసీ పాలెపోగు వీరయ్య, గోపనబోయిన వెంక టేశ్వర్లు, మహిళలు, అభిమానులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *