ఎమర్జింగ్ డైమెన్షన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అను అంశంపై సదస్సు ప్రారంభం – భారత రాజకీయాలలో వస్తున్న పరిణామాలను అధ్యయం చెయ్యాలి

ఎమర్జింగ్ డైమెన్షన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అను అంశంపై శుక్ర, శనివారం రెండు రోజుల పాటు నిర్వహించన్ను జాతీయ సదస్సు హైదరాబాద్ బేగం పేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రారంభమైనది. రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రిన్సిపాల్ డాక్టర్ కె పద్మావతి అధ్యక్షతన నిర్వహించారు. ఉన్నతి విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి , ఉస్మానియా విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. భారత రాజకీయాల్లో వస్తున్న పరిణామాలను అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉందని, ఈ ఆలోచన ధారను యువతకు అందించవలసిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయ పడ్డారు. సదస్సు నిర్వాహకులు డాక్టర్ రామాచారి, డాక్టర్ కమల, డాక్టర్ నర్సిం లు అభినందించారు. విద్యా సాధనలోను, విద్యార్థులకు ఉపాధి కల్పనలోను, బేగం పేట కళాశాల ప్రత్యేకత కలిగిందని అందుకు కృషి చేస్తున్న ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులను వక్తలు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *