ఆర్థిక సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మహిళలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్ రెడ్డి ని మళ్లీ సీఎంగా గెలిపించుకునేందుకు వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని మంత్రి, సం తనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగు నాగార్జున అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి చీమకుర్తి రూరల్ పరిధికి సంబంధించిన వైఎస్సార్ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రిముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ మహిళల కోసం సీఎం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా వారి కాళ్లమీద వారు నిలబడేలాఅండగా నిలిచారని గుర్తు చేశారు. సీఎం ఆదేశాలమేరకే తాను వేమూరు నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానన్నారు. జగన్ సైనికుడిలా పనిచేసి స్థానిక ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడతానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించి సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండాను మరోసారిఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని
విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ……. సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ 99 శాతంవరకు నెరవేర్చాడని, మళ్లీ సీఎంగా గెలిపించేందుకు
మహిళలు తమ వంతు సహకారం అందించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అయితేనే
ఇప్పుడొస్తున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులకువస్తాయన్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడతకు
చెందిన నిధులు రూ.7.23 కోట్ల విలువైన చెక్కునుఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రి మేరుగు
నాగార్జున, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ చేతుల మీదుగా అందించారు. ఈ సంద
ర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న
డ్వాక్రా మహిళలు వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల సందర్భంగా థ్యాంక్యూ సీఎం సార్ అంటూప్రదర్శించిన ప్లకార్డులు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెప్మా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పేపర్ ప్లేట్ల తయారీ మిషన్ ను మంత్రిమేరుగు నాగార్జున, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెం
కాయమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, ఎంపీపీ
యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యల
క్ష్మి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు గోగినేని వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ కన్వీనర్లు క్రిష్టిపాటి శేఖరరెడ్డి,
పమిడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులు,
పార్టీ నాయకులు పాల్గొన్నారు.





