ఎమర్జింగ్ డైమెన్షన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే అంశంపై ఫిబ్రవరి 9, 10 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సును ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బేగంపేట -హైదరాబాద్ రాజనీతి శాస్త్ర విభాగం నిర్వహించింది. ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ పద్ధతిలోనూ ఈ సదస్సులో 90 పత్రాలు సమర్పించారు.పలు అంశాలను ప్రస్తావించారు.ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు అధ్యక్షతన చర్చా వేదిక నిర్వహింపబడింది.తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, శ్రీలంక వంటి ఇతరదేశాల నుండి పత్రాలు సమర్పించారు.విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ, సాంకేతిక తదితర అంశాలపై విలువైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ముగింపు సమావేశంలో ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి జాతీయ విధానం -2020 యొక్క ప్రాధాన్యతను తెలిపారు.ఇది విద్యార్థులకు ఎంతగానో సహాయకారిగా ఉందని గుర్తుచేసారు. ICSSR డైరెక్టర్ ప్రొఫెసర్ B.సుధాకర రెడ్డి విద్యార్ధులు, అధ్యాపకులు పరిశోధన వైపు అడుగులు వేయాలన్నారు.సంస్థ ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని అందుకోవాలని సూచించారు.ప్రముఖ పర్యావరణవేత్త, రాజనీతి శాస్త్రజ్ఞులు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గ్రీన్ రెవల్యూషన్ గురించి తెలియజేస్తూ, ఉత్తర భారత దేశంలోని హిమాలయాల నుండి దక్షిణ భారత సముద్రాల వరకూ పర్యావరణం ఎంతగా కలుషితమైందో తెలియజేసారు. స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావాలని , అందుకు కృషిచేయాలని సూచించారు.ఈనాటికీ మన దేశంలో ‘పర్యావరణ పరిరక్షణ చట్టం’లేదన్నారు.ఆదిశగా అడుగులు పడాలన్నారు.మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ తిరుపతి రెడ్డి సదస్సు నిర్వాహకులను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్.కె.పద్మావతి సారథ్యంలో ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయ్యినప్పటికీ,ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నామని, అయినా మనమందరం సమిష్టిగా ఉన్నామని గుర్తుచేసారు. ఎన్నో ఆధునిక అంశాలను ప్రతిబింబింప చేసే భారతీయ సంస్కృతిని గౌరవించాలన్నారు. నాయకులు ప్రజలకు సంక్షేమాన్ని అందించాలన్నారు. ఈ రెండు రోజుల సదస్సు ఎన్నో ఆలోచనలను రేకెత్తించిందని, సమస్యలు,వాటి పరిష్కారాలు తెలిపిందని, సదస్సు ఆశయం నెరవేరిందని ప్రిన్సిపాల్ అన్నారు . కన్వీనర్ డా.ఎమ్.రామాచారి,కో- కన్వీనర్లు కె.కమల,జి.నర్సింలు ను అభినందించారు. పత్ర సమర్పకులకు సర్టిఫికెట్లు అందించారు. అతిథి సత్కారంతోనూ, వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది .
