భారత రత్న అవార్డు గ్రహితలకు నివాళి – ఆచార్య ఎని రంగా సంస్థ, సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ

ఆచార్య ఎన్. జి రంగా సంస్థ సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తంగా భారత రత్న అవార్డు గ్రహీతలకు మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పివీ నరసింహారావు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవెత్త డాక్టర్ ఎంఎస్ స్వామి నాథన్ కు ఘన నివాళులు అర్పించారు. ఆచార్య ఎన్. జి రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం ఎన్. జి రంగా భవన్లో సమావేశం నిర్వహించారు. దేశానికి, వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు వారు చేసిన సేవలను వక్తలు కొనియాడి నివాళులు అర్పించారు. చుండూరి రంగారావు, చంచు శేషయ్య, వెంకటేశ్వర్లు, నాగినేని అవనీంద్ర ప్రసాద్, ధూలి పాళ్ల వీరణారాయణ సందేశం ఇచ్చారు. సాంతంత్ర్య ఉద్యమంలో పాల్గొనటంతో పాటు ఉత్తమ పార్లమెంటేరియన్ గా సుదీర్ఘ దేశ సేవలు అందించిన ఆచార్య ఎని రంగాకు, ప్రముఖ సినీనటుడిగా, ఎపీ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఎన్. టి రామారావుకు భారత రత్న ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేసారు. ఎన్. జి రంగా, రైతు సంఘ నాయకులు నాదేండ్ల చంద్రశేఖరరావు, కోటేశ్వరావు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, సాంబశివ రావు, వెంకట క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *