కాంగ్రెస్ ప్రవేశపెట్టిన జన రంజకమైన బడ్జెట్ ను చూసి ఓర్వలేక బారాసా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు… టి పి సి సి ప్రధాన కార్యదర్శి .సనత్ నగర్ నియోజకవర్గ నాయకురాలు కోట నీలిమ

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన కొద్ది కాలం లోనే జన రంజక మైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు అని.అది చూసి ఓర్వలేక భారత రాష్ట్ర సమితి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టి.పి. సి . సీ ప్రధాన కార్యదర్శి.సనత్ నగర్ నియోజక వర్గ నాయకురాలు డాక్టర్ కోట నీలిమ అన్నారు.. 10 సంవత్సరాలలో బారాస చేయలేని పనులను 10 వారాల్లోనే తాము పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో కోట నీలిమ సమక్షంలో మైనారిటీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని త్వరలోనే మిగిలిన హామీలను కూడా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.. బారాస నాయకులు కాంగ్రెస్ పేద ప్రజలకు చేస్తున్న పనితీరును గమనించి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు..కార్యక్రమంలో సీనియర్ నాయకులు షేక్ అక్బర్ పాషా,అబ్దుల్ మోయిజ్,సయ్యద్ అహ్మద్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *