దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్వంలో నాడు నాన్న దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డి, మా కుటుంబం వైఎస్ కుటుంబం వెంట నడిచామని, కష్టాలలో, సుఖాలలో వారి వెంట పయనించామని అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో దర్శి నియోజక వర్గానికి చెందిన ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగుల సమావేశం ఆదివారం కూకట్ పల్లి లోని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శినియోజక వర్గ సమన్వయ కర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాడు నాన్న బూచేపల్లి సుబ్బా రెడ్డితో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నీవు ఉంటావా అబ్బాయి ఉంటాడా అని అడిగినప్పుడు నాన్న గారు అబ్బాయి ఉంటాడని దీవించాడని గుర్తు చేసుకున్నారు. నాడు నుండి నేటి వరకు వైఎస్ కుటుంబంతోనే నడుస్తున్నామని అందుకే నాడు ఎమ్మెల్యేగా మరలా నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం వైఎస్ జగనన్న అవకాశం ఇచ్చాడని అన్నారు.అమ్మకు జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇచ్చి ప్రజా సేవ చేయటానికి మరింత అవకాశం కల్పించారని అన్నారు. ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగులు అందరూ ఐక్యంగా పనిచేసి తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఐటీ ఉద్యోగాలను తాను కల్పించానని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకోవటం హాస్యాస్పాదమని విమర్శించారు. ముందుగా కూకట్ పల్లిలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగులతో కలసి భారీ ర్యాలీగా సమావేశ మందిరంకు చేరుకుని, దివంగత సీఎంకు, దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించి సభను ప్రారంభించారు. వైఎస్సార్సీపీ దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సతీమణి నందిని, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటీ సెల్ అధ్యక్షుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు.





