ప్రకాశం జిల్లా బొద్దికూరపాడు జెడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు వెన్నపూస ఓంకార్ మహేశ్వర రెడ్డి, వెదురూరి తులసి హర్షిణిలు జాతీయ స్థాయిలో సబ్ జూనియర్ రగ్బి పోటీలకు ఎంపికయ్యారు. గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్ లో ఈ పోటీలు జరగనున్నాయి. ప్రధానోపాధ్యాయుడు పి సుబ్బారావు, పీఈటీ ఎస్ రవి ప్రసాద్ రెడ్డి, సర్పంచి మందా శ్యామ్సన్, ఎంపీటీసీ బాల కోటయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, పీఎంసీ చైర్మన్ వై క్రిష్ణా రెడ్డి, సంగన యోగిరెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం ఎస్ అంజి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
