పేదల పార్టీ వైఎస్సార్ సీపీ – జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి – శివరాజ్ నగర్ లో మన ఊరికి మన శివన్న నిర్వహణ

పేదల అభివృద్ధే లక్ష్యంగా ఏర్ప డిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని దర్శి ఇన్చా ర్జి, మాజీ శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదరెడ్డి పేర్కొన్నారు. మన ఊరికి మన శివన్న కార్యక్రమలో భాగంగా సోమవారం రాత్రి మండ లంలోని శివరాజనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఆయనకు నాయకులు, అభి మానులు, కార్యకర్తలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్ని కష్టాలైనా ఎదురొడ్డి నిలబడ్డ ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు కరోనా కష్టకాలంలో కూడా వెనకడుగు వేయకుండా సకా లంలో అమలు చేసిన ఘతన వైఎస్ జగన్మోహన రెడ్డిదేనన్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి అక్కచెల్లెమ్మలతో పాటు రైతులను కూడా వెన్ను పోటు పొడిచిన వెన్నుపోటు వీరుడు చంద్రబాబు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోమారు వస్తున్నారన్నారు. గతంలో రైతుల రుణమాఫీ,పసుపు కుంకుమ, మహిళా రుణాల రద్దు పేరుతో మోసం చేసిన బాబును ప్రజలు గుర్తు పెట్టుకొని మళ్లీ మోసపోవద్దని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనరు వెన్న పూస వెంకటరెడ్డి,మాజీ ఎంపీటీసీ టి.సుబ్బారెడ్డి, బ్రహ్మయ్య, శ్రీనివాసగౌడ్, తన్నీరు అంకమ్మ, ఏడుకొండలు, రామకృష్ణ, సుబ్బారావు, సౌజన్య, మౌనీషా, రాజ్యలక్ష్మి, భాగ్యం, కరిముల్లా, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అం జిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనరు దేవ ప్రసాద్, నెడ్క్యాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరు పతిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కపురం శ్రీనివాసరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపా ల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వి.చెన్నారెడ్డి, ఎదురు కోటిరెడ్డి, లాజర్, సురేష్, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, కౌన్సిలర్లు మోహన్రెడ్డి, బాబు, మోహ న్బాబు, కొడవటి జాన్, ఆర్.భాస్కర్, దొనకొండ మండల మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కేవీ రెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *