ప్రకాశం లోని పలువురు ప్రముఖులు బిజేపిలో చేరిక. -స్వాగతించిన రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి- జిల్లాలో బిజెపి విజయానికి కృషి చేస్తామని ప్రకటన

రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి నేతృత్వంలో ప్రకాశం జిల్లా పార్లమెంట్ పరిధిలోని పలువురు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పురందేశ్వరి వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాను కప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం, విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎర్రగొండపాలెం పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామం రెడ్డి సామాజిక వర్గమునకు వ్యాపారస్తులు చెందిన రామచంద్రారెడ్డి, ఒంగోలు నగరానికి చెందిన వ్యాపారస్తులు కమ్మ సామాజిక వర్గ కావూరి వాసు, ఒంగోలు నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది బలిజ సామాజిక వర్గ అయినా బత్తిన సుబ్బారావు, మరియు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త షేక్ ఖాదరవల్లి షఫీ లు భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న పథకాలు ఉన్నత లక్ష్యాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా పార్టీల చేరుచున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అరాచక పాలన కొనసాగిస్తున్న వైసిపి ప్రభుత్వ చర్యలను ప్రజలకు తెలిపే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ కండువా కప్పుకున్న ప్రతినిధులు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీ మహిళలకు ఎంత విలువైన త్రిపుల్ తలాక్ రద్దు పరిచిందని, సబ్కా సాథ్ సబ్కా వికాస్ ద్వారా ముస్లింలు పెద్ద ఎత్తున లబ్ధి పొందారని అంతేకాకుండా అన్ని సామాజిక వర్గాలకు సరైన న్యాయం చేకూరుస్తూ 10 శాతం రిజర్వేషన్ కల్పించడం ఇలా ఎన్నో విధాలుగా ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతున్న భారతీయ జనతా పార్టీకి తమ వంతుగా బలోపేతం చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి ఆదేశానుసారం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *