పొగాకు రైతులు ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలి- రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహణ వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ

పొగాకు రైతులు ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన పొగాకు ఉత్పత్తికి కృషి చెయ్యాలని ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి కోవి రామ క్రిష్ణ కోరారు. సూరా రెడ్డి పాలెంలో సోమవారం రైతులకు ఆకు రెలుపు, క్యూరింగ్, గ్రెడింగ్ సుస్ధిరమైన పొగాకు సాగులో మెళుకువలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించరు. వేలం నిర్వాహణాధికారి కోవి రామ క్రిష్ణ మాట్లాడుతూ పొగాకు గెలుపుల తర్వాత ఆకులపై నేలపై కాకుండా టార్బలిన్ పై ఉంచి అల్లకం చేయాలని సూచించారు. ఎటువంటి రసాయనలు వాడకూడదని, శాస్త్రవేత్తల సలహాల మేరకు అవసరమైన పరిస్థితి బట్టి వాడాలని చెప్పారు. బ్యారన్లో అగ్ని ప్రమాదాల బారిన పడకుండ ఇనుప జల్లెడను. అమర్చాలని చెప్పారు. బ్యారన్ల ఉష్ణోగ్రతను తెలిపే ధర్మామీటర్ను తప్పక వినియోగించాలని కోరారు. ఐటీసీ ప్రతినిథి యశ్వంత్ మాట్లాడుతూ ..బ్యరన్లో పరిమితికి మించి ఎక్కువ కర్రలను ఉపయోగించరాదని చెప్పరు. వెంచెరి పొయ్యి బిగించటం వలన పుల్ల ఖర్చు ఆదా చెయ్యవచ్చని చెప్పారు. వివిధ గెలుపు ఆకులను విడి విడిగా మండెలు వేసుకోవాలని చెప్పారు. మండె నుండి తేమ బయటకు పోకుండా బయట తేమ ఆకులు పీల్చు కోకుండా టార్చాలిన్లను కల్పి ఉంచాలని చెప్పారు. బోర్డు నిబంధనల ప్రకారం ఫారం-1 గ్రెడింగ్ చేసి 150 కేజీల కంటే మించకుమా బేళ్ల కట్టవలెనని సూచించారు. కురచ ఆకులను, పచ్చ ఆకులు ఇతర గ్రేడు ఆకులు చూరా ఆకులను మేలిమి ఆకులతో కలప రాదని అన్నారు. గ్రెడింగ్ చేయు సమయంలో అన్య పదార్థాలు కలపకుండా వాటిని బుట్టలో వేసుకుని తర్వాత బయట పడవేయ్యాలని చెప్పారు. బేళ్లను తయారు చేయు సమయంలో న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ పేపర్స్ వాడకూడదని అన్నారు. జీపీఐ ప్రతినిధి కళ్యాణ్, పీఎస్ఎస్ హెచ్ ప్రతినిథి రామాంజనేయులు, బోర్డ్ ఫీల్డ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, రైతు సంఘ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *