రైతులందరూ నూతన సాంకేతికతపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉన్న ట్లయితే వ్యవసాయం లో మంచి యాజమాన్య పద్ధతుల పాటు ఫలితం పొందవచ్చుని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి బి ప్రసా దరావు అన్నారు. మండల కేంద్రమైన తాళ్లూరు లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులకు టెక్నాలజీ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రసాదరావు మాట్లాడుతూ రైతులకు అవసరమైన నూతన సాంకేతిక వ్యవసాయ విధానాన్ని తెలియచేసే విధంగా బటన్ నొక్కడంతోనే పూర్తి వ్యవసాయ సమాచారం తెలుసుకునే విధంగా నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. రైతులంతా తమ మొబైల్ ఫోన్లలో 94949218 73 నెంబర్బుకు హాయ్ అని పెడితే క్యూఆర్ కోడ్ వస్తుందని దానిని సరి చేసుకుని ఓకే చేసినట్లయితే ప్రతి రైతు అగ్రి చాట్ యాప్ నందు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. దీని ద్వారా రైతులకు తెలుగులో వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రి చాట్ అనే సాంకేతికను తీసుకువచ్చిందన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
