తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం ప్రాథమిక పాఠశాల (ఏఏ), అంగన్ వాడీ కేద్రాల్లోని చిన్నారులకు మంగళవారం తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి వైద్య పరీక్షలు చేశారు. జగనన్న గోరుముద్ద పథకం ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ప్రధానోపాధ్యా యుడు పి.సుబ్బారెడ్డి, సీహెచ్ ఓ ప్రభావతి, ఏఎన్ఎం సుజాత , ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


