సౌత్ ఇండియా రోప్ స్కిప్పింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో తాళ్లూరు సరస్వతీ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి విజేతలుగా నిలిచారు. గుంటూరు లోని శ్రీ మాజేటి గురవయ్య డిగ్రీ కాలేజీలో జరిగిన సౌత్తోజోన్ నేషనల్ స్కిప్పింగ్ పోటీల్లో అండర్-14 విభాగంలో స్పీడ్ హాప్ స్కిప్పింగ్ పోటీల్లో 8వతరగతి విద్యార్థిని పూర్ణిమ(ప్రథమస్థానం), అండర్ -17 విభాగంలో 9వ తరగతి విద్యార్థిని పావని(ద్వితీయస్థానం) సాధించారు. డబుల్ టచ్ గ్రూపులో స్నేహలత రెడ్డి, బ్లెస్సీ (ద్వితీయస్థానం), బాలుర విభా గంలో స్పీడ్ డబుల్ అండర్ రీలే గ్రూప్ పోటీల్లో ఈశ్వర్, సురేంద్రరెడ్డి, సాయిచరణ్, నెహేమియాలు (ద్వితీయస్థానం) సాధించారు. వీరిని విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డి, హెచ్ఎం వి.శ్రీరామమూర్తి, పీఈటీ వికాస్, డీన్ వెంకటరెడ్డిలు అభినందించారు.

