ఈ – కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయండి -తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద రావు

పీఎం కిసాన్ లబ్దిదారులకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదరావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన దోసకాయల పాడు గ్రామంలో పర్యటించి రైతు భరోసా కేంద్రం నందు గ్రామ వ్యవసాయ సహాయకులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ… పీఎం కిసాన్ పథకానికి అర్హత సాధించి ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేసుకోనటువంటి మిగిలిపోయిన వారిని వెంటనే ఈ కేవైసీ 100% పూర్తి చేసే విధంగా గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రయత్నించాలని ఆయన తెలిపారు.
అన్ని అర్హతలు ఉండి ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల పీఎం కిసాన్ పథకాన్ని పొందలేక ఉన్నటువంటి వారిని గుర్తించి వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. రానున్న పది రోజుల వరకు కామన్ సర్వీస్ సెంటర్ పనిచేస్తుందని అందువల్ల 100శాతం ఈ కేవైసీ పూర్తి చేయాలని ఆయన తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *