పేదలందరికీ న్యాయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోనే సాధ్యమని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెం ట్ రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. దర్శి నియోజకవర్గ వైఎ స్సార్ సీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్సీపీ నియోజకవర్గఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లు వారికి ఘనస్వాగతం పలికారు. గజమాలలు మెమొంటోలతోసత్కరించారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయాన్నిబాలినేని శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ రూంలను చెవిరెడ్డిభాస్కర్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగాఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలినేనిశ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ జగనన్న ప్రవేశ పెట్టిన పథకాలే వైఎస్సార్సీపీ సంపూర్ణవిజయం సాధించడానికి కారణం అవుతాయన్నారు.మొదటి నుంచి బూచేపల్లి కుటుంబానికి మంచి పేరుప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు. బూచేపల్లి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నియోజకవర్గ ప్రజలందరూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ని ఎమ్మెల్యేగా కోరుకున్నారని, అందుకేసీఎం జగన్.. ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశంకల్పించారన్నారు. పార్టీలో గ్రూపులు, విభేదాలులేకుండా పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.
జిల్లాలో అన్నీ సీట్లు వైఎస్సార్ సీపీ గెలుస్తుందనిధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో 175కి 175సీట్లతో జగనన్న మళ్లీ సీఎం కావడం ఖాయమనిచెప్పారు. భగవంతుని ఆశీస్సులతో బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి రానున్న ఎన్నికల్లో గతంలో కంటే రెట్టింపు మెజార్టీలో గెలిపించాలని కార్యకర్తకు విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే బలం- జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఇన్చార్జి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి-ఘనంగా వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం
కార్యకర్తలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ అన్నారు. దర్శి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం పట్టణంలో బుధ వారం అంగరంగ వైభవంగా జరిగింది. దర్శి నియోజక వర్గంలోని ఐదు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ముందుగా బూచేపల్లి వెంకాయమ్మ, శివ ప్రసాద్ రెడ్డి
లు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోవును కార్యాలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివా సరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు కార్యాలయం, ఆఫీసు ను ప్రారంభించారు. గుమ్మడి కాయ లతో దిష్టి తీసి వేదమంత్రాల నడుమ డప్పు వాయి ద్యాలతో నిర్వహించిన కార్యక్రమం అంగరంగ వైభ వంగా జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. వచ్చిన నాయకులు, కార్యకర్త లను ఉదయం నుంచి అల్పాహారం, మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థ నలు చేశారు.
సింహం సింగిల్ వస్తోంది..
అనంతరం కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ డ్డిలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే మాట ఒకే జెండా అని అన్నారు. సింహం సింగి ల్ వస్తుందని, మాటతప్పని మడమ తిప్పని అజెండానే వైఎస్సార్ సీపీ జెండా అన్నారు. సింగి ల్గా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేక మూడు జెండాలు, అబద్ధపు హామీలతో ఓట్ల కోసం మళ్లీ ప్రజ లను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు మూడుసార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు పెట్టిన పథకాలు చెప్పి ఎన్నికలకు వచ్చే దమ్ము లేద న్నారు. 2014లో 600పైగా హామీలు ఇచ్చి చంద్ర బాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి పథ కాలు ప్రవేశ పెడితే జన్మభూమి కమిటీలు పేదల సొమ్మును పందికొక్కుల్లా దోచుకుతిన్నాయన్నారు. మాటమీద నిలబడే అసలైన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అయితే మాటతప్పే నాయకుడు చంద్ర బాబు అని ప్రజలు గమనించాలని సూచించారు. నియోజకవర్గంలో 12 సర్వేలు చేస్తే అన్నీ వైఎ స్సార్ సీపీ విజయం సాధిస్తుందని తెలిపాయ న్నారు. 2024 ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని, ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 175కు 175 సీట్లు గెలుపొందేలా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ఆయా కార్యక్రమాలలో దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి (మహేష్),దర్శి,
దొనకొండ, ముండ్లమూరు, ఎంపీపీలు సుధాఅచ్చయ్య, బొరిగొర్ల ఉషామురళి, సుంకర సునీతాబ్రహ్మానందరెడ్డి,
షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్యవిభాగంరాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, బెల్లం సురేష్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎన్ఆర్ఆడీ డైరెక్టర్ తిరుపతిరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, కాపా రమణారెడ్డి, మండలపార్టీ కన్వీనర్లు తూము వెంకటసుబ్బారెడ్డి, యన్నాబత్తిన వెంకటసుబ్బయ్య, జేసీఎస్కన్వీనర్లు గుంటు పోలయ్య, బత్తినేని వెంకటేశ్వర్లు,మేరువ సుబ్బారెడ్డి, యాడిక శ్రీనివాసరెడ్డి, ఎదురుకోటిరెడ్డి, జెడ్పీటీసీలు తాతపూడి రత్నరాజు, నుసుంనాగిరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడుబండి గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీలు కొరివిముసలయ్య, సోముదుర్గారెడ్డి, యడమకంటి వెంకటేశ్వరరెడ్డి,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఐవీ సుబ్బారెడ్డి, కాపా రమణారెడ్డి, జెడ్పీటీసీలు తాతపూడి రత్నరాజు, నుసుం నాగిరెడ్డి, ము దుర్గారెడ్డి, యడమకంటి వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షులు వేమిరెడ్డి చెన్నారెడ్డి, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, ఆవుల జ్యోతి శివారెడ్డి, తుళ్లూరి బాబూరావు, రవి, మాజీ సాగర్ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సద్ది పుల్లారెడ్డి, ఏఎంసి మాజీ చైర్మన్ కేవీ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవ దానం, వీరగంథం కోటయ్య, గోళ్లపాటి మోషే, పొశం మధుసూదన్ రెడ్డి, కోట రామిరెడ్డి, పాశం జయశిహారావు, వెన్నపూస బాపిరెడ్డి, గోను నారా యణరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, కపురం శ్రీనివాస రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు దామెర్ల చంద్రం, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, బాబు, రహముల్లా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.










