చంద్రబాబు ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం త ధ్యమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచే పల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మన ఊరు- మన శివన్న కార్యక్రమంలో భాగంగా బుధవారం దర్శి పట్టణంలోని సాయినగర్ లో ఇంటింటి ప్రచారం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ శివ ప్రసాద్ రెడ్డిలకు హారతు లిచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రతి గడపలో జగనన్న ద్వారా తాము లబ్ధి పొందామని, మా ఓటు జగనన్నకే అంటూ స్థానికులు భరోసా ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాదరెడ్డిలు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు జగనన్న చేసిన మేలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయమనే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక్కరే కనిపిం చారన్నారు. దర్శి మండల కన్వీనరు వెన్నపూస వెంకటరెడ్డి (మహేష్), షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్య విభాగంరాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం బాషా, వడ్డెర కార్పొరే షన్ డైరెక్టర్ విమల రామకృష్ణ, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ప్రచార కమిటీ కార్యదర్శి అంకబాబు, భాస్కర్, మాజీ సాగర్ ప్రాజెక్టు వైస్ ఛైర్మన్ సద్ది పుల్లారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ కేవీ రెడ్డి పాల్గొన్నారు.



