రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి – తాళ్లూరు ఎస్సై వైవి రమణయ్య

రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని,భద్రత లేకుండా ప్రయాణం చేయడంతో రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎస్సై వైవీ రమణయ్య అన్నారు. బుధవారం తాళ్లూరు బస్టాండ్ సెంటర్లో ద్విచక్ర వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ మధ్య కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలతో ఎక్కువశాతం మరణాలు సంభవించాయని తెలిపారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఓవర్ క్రాస్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలువురికి ఈ చలానా విధించారు. ఆయన వెంట పిసీలు బ్రహ్మనాయుడు, మాలకొండయ్య ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *