రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని సంస్థగతంగా బలీయం చేయడానికి భారతీయ జనతా పార్టీ విశేషంగా కృషి చేస్తూ యువతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షైక్ బాజీ ఆదేశానుసారం ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివా రెడ్డి ఖాదర్ వలి ని ప్రకాశం జిల్లా అధ్యక్షులు గా నియమించి నారు. శివా రెడ్డి జిల్లా లో ఉన్న ముస్లిం సోదరా లను ఒక తాటి మీదకు తీసుకోని వచ్చి అటు పార్టీ కి మీకు మంచి గుర్తుంపు తీసుకోని రావాలి అని కోరారు. ఈ సందర్భంగా పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు ఖాదర్ వలీ ని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జిల్లాలో ఉన్న నాయకులందరూ శుభాకాంక్షలు తెలిపినారు. తనకు బాధ్యత ఇవ్వడం పట్ల జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి , రాష్ట్ర అధ్యక్షులు షైక్ బాజీ గారికి ధన్యవాదాలు తెలిపానారు.
