గ్రామ సచివాలయాలతో సుపరిపాలన -మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి -సైనికుడిలా పనిచేస్తా ఆశీర్వదించండి: మంత్రి మేరుగు -సచివాలయాలు, ఆర్ బీకే, ఇతర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు-కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల ద్వారా ప్రజలకు అద్భుతమైన పరి పాలన అందిస్తున్నారని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి మేరుగు నాగార్జున, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డితో కలిసిగురువారం కూనంనేనివారిపాలెం, గోనుగుంట, రామచంద్రాపురం గ్రామాల్లో సచివాలయాల సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భం కూనంనేనివారిపాలెంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ….దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివా లయాల ద్వారా ప్రజలకు పరిపాలనను అందు బాటులోకి తీసుకువచ్చారన్నారు. సీఎం వైఎస్ జగ న్మోహన్ రెడ్డి ప్రతి పైసాను పారదర్శకంగా ప్రజ లకు అందించారన్నారు. కానీ చంద్రబాబు హయాంలో ప్రజల సొమ్మంతా జన్మభూమి కమిటీ లకు చేరాయని ఎద్దేవా చేశారు. జిల్లాల విభజనలో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం బాప ట్ల జిల్లాలో కలపాల్సి ఉందని, కానీ ఒంగోలు చుట్టుపక్కల విస్తరించి ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉండేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఒప్పించానని, అందుకు సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలపాలన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమ న్వయకర్తగా జిల్లా మంత్రి మేరుగు నాగార్జునను సీఎం నియమించారని, ఆయన్ను గెలిపించాల్సినబాధ్యత తనతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వారి కుటుంబంపై ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మేరుగు నాగార్జు నను మంచి మెజారిటీతో గెలిపించాలని ఆయన్ను పరిచయం చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, సం తనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ బాలినేని శ్రీనివా సరెడ్డి సూచనలు పాటిస్తూ బూచేపల్లి కుటుంబం అండదండలతో నియోజకవర్గంలోని ప్రజలందరినీ కలుపుకుపోతానని, సైనికుడిలా పనిచేస్తూ వైఎస్సార్ సీపీ జెండాను తన భుజాన వేసుకొని మోస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో సంతనూతల పాడు ఎమ్మెల్యేగా గెలిపించాలని స్థానిక ప్రజలకు మేరుగు నాగార్జున విజ్ఞప్తి చేశారు. జిల్లాపరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ గ్రామాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే వైఎస్సార్ సీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అమూల్ సంస్థ వారి ద్వారా ఒక్కో లీటర్ పాలపై నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు.
రూ.4.75 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి మం త్రి మేరుగు నాగార్జున, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా కూనంనేనివారిపాలెం, గోనుగుంట, రామచంద్రాపురం గ్రామాల్లో కలిపి రూ.4.75 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శం కుస్థాపనలు చేశారు. వాటిలో రూ.1.20 కోట్లతో నిర్మించిన మూడు సచివాలయాలు, రూ.41.6 లక్ష లతో రెండు రైతు భరోసా కేంద్రాలు, రూ.17.6 లక్ష లతో బల్క్ మిల్క్ సెంటర్లు, రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాలు, రామచంద్రాపురం-జీఎల్.పురం మధ్య రూ.47 లక్షలతో వంతెనను, కూనంనేనివారి పాలెం సచివాలయాల కాంప్లెక్స్ చుట్టూ రూ.30 లక్ష లతో ప్రహరీ నిర్మాణాన్ని ప్రారంభించారు. వాటితో పాటు రూ.2 కోట్ల విలువైన పొగాకు గోడౌన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కూనంనేనివారిపాలెంలోని సచివాలయాలు, ఆర్బీకే, పొగాకు గోడౌన్ ల నిర్మాణా నికి అవసరమైన రూ.2 కోట్ల విలువైన 2 ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందించిన దాతలు పమిడి వెంక టేశ్వర్లు, పమిడి రత్తమ్మ, పమిడి లక్ష్మీదేవమ్మ, పమిడి శ్రీనివాసరావు, పమిడి వెంకాయమ్మ, పమిడి నరశిం హరావు, గోరంట్ల వెంకట రమణయ్య, ప్రసాద్ అం దించారు. వారిని ఈ సందర్భంగా బాలినేని, మేరుగు, బూచేపల్లి చేతుల మీదుగా శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి అభినందించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాస రావు, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రెసిడెంట్ వాకా బసివిరెడ్డి, వైస్ ఎంపీపీ జ్యేష్య శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, గోగినేని వెంకటేశ్వర్లు, జేసీఎస్ కన్వీనర్లు మంచా హరికృష్ణ, చిన్నపురెడ్డి మస్తాన్ రెడ్డి , యర్రగుంట్ల వసంతరావు, ఏలూరి శ్రీలక్ష్మి, ఏలూరి సుబ్బా రావు, యర్రగుంట్ల మోహన్, బొడ్డు కోటేశ్వరరావు, కుంచాల రాంబాబు, ఓబుల్ రెడ్డి, స్థానిక నాయకులుపాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *