ముండ్లమూరులో శుక్రవారం
మండల వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదే శ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ బంద్ సీఐటీయూ కార్యకర్తలు, అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పోస్టాఫీసు, ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లను మూసి వేయించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనే యులు మాట్లాడగా ఈ కార్యక్రమంలో బోడ పాటి హనుమంతరావు, ఎర్రయ్య, కొండలు, రమేష్, సత్యం, విజయలక్ష్మి, జయశ్రీ, దీనమ్మ, శేషమ్మ, రాధా తదితరులు పాల్గొన్నారు.


