తితిదే రధసప్తమి వేడుకలలో పొన్నూరు వేంకట శ్రీనివాసులు.

తిరుమల తిరుపతి దేవస్థానాలలో శుక్రవారం నిర్వహించిన రథసప్తమి వేడుకలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులకు అరుదైన గౌరవం దక్కింది. రథసప్తమి సందర్భంగా ఒకే రోజు నిర్వహించే ఏడు వాహన సేవలలో మూడువాహన సేవలకు పొన్నూరు శ్రీనివాస్ వ్యాఖ్యానాన్ని అందించారు. తిరుపతిలోని గోవిందరాజ స్వామి దేవస్థానంలో ఉదయం హంస వాహన సేవకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. అలానే తిరుమల కొండపై జరిగిన రథసప్తమి వేడుకలలో సాయంత్రం కల్పవృక్ష వాహన సేవకు, రాత్రి చంద్రప్రభ వాహన సేవకు పొన్నూరు వేంకట శ్రీనివాసులు ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాషిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానాలలో వేలాది భక్త జన సందోహం మధ్య తన వ్యాఖ్యాన మాధుర్యాన్ని అందించిన పొన్నూరు వెంకట శ్రీనివాసులు పలువురు ఆధ్యాత్మిక వేత్తలు అభినందించారు. గతంలో కూడా శ్రీశైల పుణ్య క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించిన పాగాలంకరణ సేవకు, దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానంలో ఉపన్యాసం చేసి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న పొన్నూరు వేంకట శ్రీనివాసులు ను ప్రకాశంజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి యత్తపు కొండారెడ్డి, కోశాధికారి కె.వి.రమణారెడ్డి, సంఘ సభ్యులు, అన్నమయ్య సంగీత సంస్థ అధ్యక్షులు ఐ. మురళీకృష్ణ, ఎఱ్ఱన సాహితీ సంస్థ అధ్యక్షులు మైనంపాటి సాయికుమార్, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్, గీతామందిరం భక్తబృందం అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *