అయోధ్య శ్రీ బాల రాముని దర్శనార్థం విశ్వహిందూ పరిషత్ ప్రకాశం విభాగ్ (విశ్వహిందూ పరిషత్ ఒంగోలు జిల్లా, మార్కాపురం జిల్లా) కార్యకర్తలు 70 మంది రైల్వే శాఖ ఏర్పాటు ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలుబండి “ఆస్తా” ద్వారా అయోధ్య బయలుదేరారు. విశ్వహిందూ పరిషత్ ప్రకాశం విభాగం ఒంగోలు జిల్లా మరియు మార్కాపురం జిల్లా నుండి విచ్చేసిన కార్యకర్తలు పలికిన జై శ్రీరామ్ నినాదాలతో ఒంగోలు రైల్వే స్టేషన్ మార్మోగినది.
దక్షిణాంధ్రా కార్యకర్తలను కలుపుకొంటూ విజయవాడ నుండి బయలుదేరిన రైలు బండి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, యర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూలు, మహబూబ్ నగర్, కాచిగూడ, కాజిపేట, బలార్షా, గూండియా, బాలాఘాట్, జబల్ పూర్, కట్ని, మణిక్ పూర్, ప్రయాగ్ రాజ్, జవున్ పూర్, షాగంజ్ మీదుగా అయోధ్య ధామ్ స్టేషన్ చేరుతుందని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు. హిందువుల 500 సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట అనంతరం అయోధ్య ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఎందరో త్యాగధనుల ఫలితం, న్యాయమైన తీర్పు రాకతో… మన సమకాలిన కాలంలో దివ్యమైన భవ్య రామమందిరం నిర్మాణమవడం మన అదృష్టమని పేర్కొన్నారు. ప్రయాణ సమయం అధికమైనా అందరితో కలసి ప్రయాణం అనుభూతి వర్ణణాతీతమన్నారు. అయోధ్య నుండి తిరుగు ప్రయాణం 23వ తేది ఉదయం 8.30 గం.లకు ఒంగోలు చేరుతామని వివరించారు.
