వైఎస్ పాలనలోనే ముస్లింలకు పెద్దపీట – వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్ కల్పించి సముచిత స్థానం ఇచ్చారని వైఎస్సార్ సీపీ దర్శి ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. కురిచేడులోని మదరస ఏ దారుల్ ఉలూమ్ హుస్సేనియా, ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవ జల్సా కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఢిల్లీ నుంచి కార్యక్రమానికి హాజరైన ముస్లిం పెద్దలు హుస్సేన్ అహ్మద్ సాహెబ్, మునీరుద్దీన్ సాహెబ్ ఆశీ స్సులు తీసుకున్నారు. అనంతరం డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదరెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు సముచిత స్థానం కల్పిస్తే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి షేక్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాజకీయంగా సముచిత స్థానం కల్పించి ఆదరించారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలను వాడుకొని వదిలేస్తే సీఎం వైఎస్ పాలనలో ముస్లింలకు సముచిత స్థానంతో పాటు అన్ని విధాలా వారి అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చార న్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహనరెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. దర్శి నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా అన్ని విధాలా ప్రజలకు అండగా ఉంటూ సేవ చేస్తున్న బూచేపల్లి కుటుం బాన్ని ఆదరించాలన్నారు. దర్శి నియో జకవర్గం తరఫున జగనన్న సైనికుడిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి ఆదరిం చాలని, అధిక మెజార్టీతో విజయం చేకూర్చాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్. సైదా, హజరత్ మౌలానాముప్తి జుబేర్ అహ్మద్సాహెబ్, రాష్ట్ర నెడ్క్యాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్యవిభాగం కన్వీనర్ డాక్టర్ ఎస్ ఎం బాషా, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగి రెడ్డి, కె.రమణారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీ నర్ గాలిమూటు దేవప్రసాదు, ఏఎంసీ వైస్ చైర్మన్ కండె గంగయ్య, మాజీ వైస్ చైర్మన్ కె. నాగేశ్వరరావు, చైర్మన్ షకీల అమీ నా బాష, పార్టీ మండల కన్వీనర్ వైవీ సుబ్బయ్య నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *