ముండ్లమూరు మండలంలోని తాళ్లూరు రోడ్డులో శ్రీరాం డెయిరీ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్ మార్పిడి ముసలయ్య (59) అక్కడికక్కడే మృతి చెం దాడు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామం, సంతనూతలపాడు గ్రామాలకు చెందిన బంధువులు కలిసి ముండ్లమూరు మండలంలోని బొప్పూడివారిపాలెం పోలేరమ్మ గుడికి ఆదివారం ఆటోలో వచ్చారు. గుడి వద్ద పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆటోలో స్వగ్రామాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ముండ్ల మూరు- తాళ్లూరు రోడ్డులో శ్రీరాం డెయిరీ సమీపంలో సుడి గాలి రావడంతో కళ్లలో దుమ్ము పడడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముసలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న పల్లామల్లికి చెందిన
తేజస్వని, రమాదేవిలకు సంతనూత లపాడుకు చెందిన ఇస్తర్ల వెంకటలక్ష్మీ, బంగారమ్మ, ఏసమ్మలకు గాయాల య్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి పంపారు. సమాచారం తెలుసుకున్న దర్శి సీఐ షమీముల్లా, ఎస్సై యువీ కృష్ణయ్యలు సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలం వద్ద బాధితులతో మాట్లాడి ప్రమాదానికి కార ణాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కానిస్టే బుళ్లు ప్రేమానిధి, సూరిబాబులో సకాలంలో బోల్తా పడిన ఆటో వద్దకు చేరుకొని గాయపడిన వారిని రెండు 108 వాహనాల్లో ఎక్కించి వైద్యశాలకు తరలించేందుకు సహకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

