అంగరంగ వైభవంగా ఆలయ ప్రతిష్ఠ – అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసిన భక్తులు – ప్రత్యేక పూజలు చేసిన డాక్టర్ బూచేపల్లి కుటుంబ సభ్యులు..

కురిచేడు లో దర్శి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.యంత్రాభిషేకం, వాస్తుపూజ, గర్తన్యాసం, రత్నన్యాసం, ధాతున్యాసం, బీజ న్యాసములు, యంత్ర ప్రతిష్ఠ, జీవధ్వజ ప్రతిష్ఠ, శిఖరకలశ ప్రతిష్ఠ కార్యక్ర మాలు నిర్వహించారు. శ్రీ గోవిందమాంబ, శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి, శ్రీవిశ్వకర్మ, గాయత్రిమాత, గణపతి, ఈశ్వరిదేవి, నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కళాన్యాసం, దృష్టి స్థాపన, ధేను ధర్శన, కుంభ దర్శనం, మహారుద్ర హోమాలు చేశారు.
ప్రత్యేక పూజలు చేసిన డాక్టర్ బూచేపల్లి కుటుంబ సభ్యులు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దర్శి రోడ్డులో సోమవారం నూతనంగా ప్రతిష్ట చేసిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ, దర్శి ఇన్చార్జి డాక్టర్ డాక్టర్ బూచేపల్లి బూచేపల్లి శివ శివ ప్రసాదరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా ఆహ్వానించారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ… సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సం మృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సం తోషాలతో ఉండాలని వీరబ్రహ్మేంద్రస్వామి వారిని కోరుకున్నారు. సామంతపూడి వీరబ్ర హ్మాచారి, బంగారు వీబ్రహ్మాచారి, ఉప్పులూరి గోపి, క్రిస్టిపాటి వెంకట రత్నాచారి, గురుకాం తాచారి, మైలోజి పరబ్రహ్మాచారి, పత్తిపాటి అల్లూరాచారి, కురిచేటి బాలాచారి, చెరువు గట్టు నాగరాజు, సొసైటీ ప్రెసిడెంటు పోతిరెడ్డి నాగిరెడ్డి, నాయకులు ఎన్వీ నాగిరెడ్డి, షకీల అమీనాబాష, పాతకోట వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *