క్యూరింగ్ సమయంలోరైతులు తగిన జాగ్రర్తలు తీసుకోవాలి -పొగాకు బోర్డు రీజనల్ మెనేజర్ ఎం. లక్ష్మణరావు

పొగాకు రైతులు క్యూరింగ్ చేయు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పొగాకు బోర్డు రీజనల్ మెనేజర్ ఎం. లక్ష్మణరావు తెలిపారు. ముంగమూరు, చేకూరపాడులలో సోమవారం క్యూరింగ్లో ఉన్న బ్యారన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఎం లక్ష్మణరావు రైతులతో మాట్లాడుతూ బ్యారన్ కు సరిపడ 800 నుండి వెయ్యి లోపు కర్రలను మాత్రమే అమర్చాలని కోరారు. క్యూరింగ్ జరిగే ముందు బ్యారన్ యొక్క స్థితిని గమనించాలని చెప్పారు. సరియైన సమయంలో ఆకులను రేల్చుకున్నట్లయితే ఆకులు ఎక్కువ పండకుండా ఆరికట్టవచ్చని చెప్పారు. రేల్చిన కులపై ఉన్న తేమకు ఆరనివ్వాలని కోరారు. ఆకు బ్యారన్లో ఎక్కించిన తర్వాత సరిపడ గాలిని ఇవ్వడం ద్వారా బ్యారన్ రాట్ రాకుండా చూసుకోవచ్చని చెప్పారు. యల్లోయింగ్ మరియు రంగు నిలుచు దశలలో తడి బల్బు ఉష్ణోగ్రత 100 డిగ్రీ ఫారన్ హీట్ లలో దాటకుండా చూసుకోవాలని చెప్పారు. కాడ ఆరే దశలో బ్యారన్ లోపన ఉష్ణోగ్రత వెంటనే పడి పోకుండా చూసుకోవాలని కోరారు. కాడ ఆరు దశ పూర్తి అయిన తర్వాత గాలి చొరబడుటకు వీలుగా అన్ని కిటికీలను తెరచి ఉంచవనేనని కోరారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకొనినచో బ్యారన్లో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *