ఆర్థిక లావాదేవీలతో జరిగిన ఘర్షణలో వ్యక్తిపై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… ఒంగోలు నగరంలోని జయరాం థియేటర్ సమీపంలో డాక్టర్ మర్రెడ్డి రామచంద్రారెడ్డి జిమ్స్ ఆస్పత్రిని నిర్వహిస్తు న్నారు. డాక్టర్ కు సమీప బంధువైన మర్రెడ్డి శ్రీనివాసరె డ్డితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డికి డాక్టర్ రామచంద్రారెడ్డి రూ.2 కోట్ల వరకు బాకీ పడ్డారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొద్ది రోజు లుగా వివాదం నడుస్తుంది. అయితే బాకీ తాలుకా రూ.20 లక్షలు ఇస్తానని చెప్పడంతో శ్రీనివాసరెడ్డి మంగ ళవారం ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అక్కడే ఉన్న డాక్టర్ వద్ద కాంపౌండర్ గా పనిచేస్తున్న తుమ్మా బాలకోటయ్య అలియాస్ బాలు ఇనుప రాడ్డుతో శ్రీనివాసరెడ్డిపై దాడి చేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డి అక్కడే రక్తపు మడుగులో పడిపోయారు. మృతి చెం దాడని భయపడిపోయిన డాక్టర్ రామచంద్రారెడ్డి, బాలు అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డిని కారు డ్రైవర్ హుటాహుటిన ప్రైవేట్ వైద్య శాలకు తరలించారు. వన్ టౌన్ సీఐ ఎం లక్ష్మణ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
