రాజ్యసభ సభ్యులు (ఎంపీ) వై వీ సుబ్బా రెడ్డిని తాళ్లూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గంగి రెడ్డి పాలెం యలమందా రెడ్డి కలిసి వైవీని సన్మానించి మిఠాయిలు పంచి పెట్టారు.

