జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను, వైఎస్సార్సీపీ దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని పలువురు తాళ్లూరు మండల ప్రజా ప్రతినిథులు, వైఎస్సార్సీపీ నాయకులు కలిసి సన్మానించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, మల్కాపురం, రజానగరం సర్పంచిలు షేక్ వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, నాయకులు బొగ్గుల శ్రీనివాస రెడ్డి, గంగి రెడ్డి పాలెం యలమందా రెడ్డిలు కలసి చైర్మన్ ను, డాక్టర్ బూచేపల్లిని సన్మానించి, పుష్పగుజ్జాలు అందించారు. పార్టీ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

