సికింద్రాబాద్.. శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యవర్గం ఎంపిక

సికింద్రాబాద్.. శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యవర్గం కొలువుతీరింది… ఓల్డ్ బోయిన్పల్లి లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్ధం నరసింహా యాదవ్ హాజరయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.. నూతన కార్యవర్గ చైర్మన్ గా పుప్పాల అశోక్ గుప్త, వైస్ చైర్మన్ పూర్ణచంద్రగుప్త, ప్రధాన కార్యదర్శి నాగశెట్టి గుప్తా, కోశాధికారి గా గౌరీ శంకర్ గుప్త లు నియమితులయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ మొత్తం ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఆర్యవైశ్యుల సమస్యలను కష్టాలను వారి అభివృద్ధికి తోడ్పాటు అందించేలా నూతన కార్యవర్గం పనిచేయాలని అన్నారు. వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు అంద రికీ మేలు చేకూర్చే పనులు చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో ప్రభు గుప్తా, రంగ రవీంద్ర గుప్తా, మురారి శెట్టి శేఖర్ ,గందె రామకృష్ణ గుప్తా, రాజేందర్ గుప్తా శ్రీరామ్ పండరి గుప్తా సత్య మూర్తి గుప్తా తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *