చిన్నారులను వారికి ఆసక్తి వున్న రంగాల్లో ప్రోత్సహించాలి…..మాజీ మంత్రి.సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

పిల్లలకు చిన్నతనం నుంచే వారికి ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 16 వ తేదీన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో మెడల్స్ సాధించిన జెక్ కాలనీకి చెందిన చిన్నారులతో ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో కోచ్ లు దేవేందర్, సిరి ఎలిజబెత్ లు MLA ను మర్యాద పూర్వకంగా కలిశారు. గోల్డ్ మెడల్ సాధించిన గుంటూరు మోక్షిక, రిత్విక్, సిల్వర్ మెడల్ సాధించిన మోక్షిత, కార్తీక్, లియోనా, శ్రీయాన్ ఇతర మెడల్స్ సాధించిన చిన్నారులను MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఎంతో శిక్షణ ఇచ్చి మెడల్స్ సాధించే విధంగా కృషి చేసిన కోచ్ లను కూడా అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *