తాళ్లూరుకు ఇంటర్ పరీక్ష కేంద్రం మంజూరు – 25 ఏళ్ల తర్వాత పరీక్ష కేంద్రం రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు హర్షం

తాళ్లూరు మండల కేంద్రమైన తాళ్లూరులోని ఊటుకూరి కోటయ్య శ్రేష్ఠ మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఇం నట్లు ప్రిన్సిపల్, జిల్లా పరీక్షల నిర్వ హణ బోర్డు కమిటీ సభ్యులు కె. ఆంజనేయులు ఆదివారం తెలిపారు. గతంలో 25 సంవత్సరాల క్రితం ఈ కాలేజీలో పరీక్ష కేంద్రం ఉండగా విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు. దీంతో పరీక్షలు రాయడానికి మండలంలోని విద్యార్థులు సుదూర ప్రాంతమైన దర్శి , అద్దంకి వెళ్లాల్సి వచ్చింది. విద్యార్థులు నానా అవస్థలు పడటంతో సమస్యను గ్రామ పెద్దలు, గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్ తారకనాథ్, ప్రస్తుత ప్రిన్సిపాల్ ఆంజనేయులు, అధ్యాపకులు ఆర్ఐఓ, ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తోడు ప్రస్తుతం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కాలేజీలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో నూతనంగా పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేశారు. తాళ్లూరు, ముండ్లమూరు మండలాలలోని సుమారు 200 మంది విద్యార్థులు ఈ కేంద్రంలో పరీక్షలు రాయనున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగను న్నట్లు చీఫ్ వై. గురవయ్య తెలిపారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 25 ఏళ్ల తర్వాత పరీక్ష కేంద్రం మరల తాళ్లూరుకి మంజూరు చేయడం పట్ల గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్ ఆంజనేయులు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *