ప్రతి విద్యార్థి కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పీఎం శ్రీధర్ అన్నారు. స్థానిక కళాశాల వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థు లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యాభివృ ద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నం దున వాటిని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదు వుకోవాలన్నారు. రానున్న పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం ప్రదర్శిం చిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. లెక్చరర్లు గురవయ్య, పార్వతిబాయి, కోటేశ్వరరావు, లలిత, లక్ష్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.



