సంక్షేమ రాజ్యం కొనసాగేం దుకు రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా చేసు కోవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ‘మన ఊరికి మన శివన్న’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం, అయ్యలపాలెం, రెడ్డిసాగర్ గ్రామాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బూచేపల్లి కుటుంబ సభ్యులను పార్టీ నేతలు గజమాలలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. వైఎ స్సార్ విగ్రహానికి బూచేపల్లి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వెలుగువారి పాలెంలో రూ.15 లక్షలతో నిర్మించిన రెండు సైడు కాల్వలు, రూ.5 లక్షల సీసీ రోడ్డు, వైఎ స్సార్ హెల్త్ క్లినిక్, జగనన్న పాల వెల్లువ భవనాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. కరోనా కష్టకా
లంలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమం త్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియా డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు జన్మభూమి కమిటీలతో పేదల సొమ్ము దోచుకుతిన్నారని విమర్శించారు. ‘మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి’ అని ఓటు అడిగే దమ్మున్న నాయకుడు ఒక వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. చంద్రబాబు రాష్ట్రా నికి చేసిందేమీ లేక పొత్తుల కోసం పాకు లాడుతున్నాడని విమర్శించారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేప ల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. రాజన్న ఆశ యాలు కొనసాగించేందుకు వైఎస్ జగన్మో హన్ రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయాలు కొనసాగించేందుకు శివప్రసాదరెడ్డి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. వెలుగువారి పాలెం గ్రామం తమ పుట్టిళ్లు లాంటిదన్నారు. దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అధిక మెజార్టీతో గెలుపించాలని
కోరారు. కార్యక్రమాల్లో మండల ఇన్చార్జి మద్ది రెడ్డి నరసింహారెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్ రెడ్డి ఎం
పీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, మాజీ ఎంపీ
పీలు పోశం మధుసూదనరెడ్డి, గోళ్లపాటి మోషే, కోట రామిరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు తూము వెంకటసుబ్బారెడ్డి,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, సర్పంచ్ల సంఘ అధ్య క్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, వెలుగువారి పాలెం సర్పంచ్ ముచ్చుమారి కోటేశ్వరమ్మ, సచివాలయ కన్వీనర్ బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీ మూలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ మూలంరెడ్డి ఓబుల్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, చిన్నపు రెడ్డి రామకోటిరెడ్డి, యర్రారెడ్డి, వెంకటరెడ్డి, నాగం బొట్లవారిపాలెం ,తాళ్లూరు సర్పంచ్ లు సుబ్బారావు, చార్లెస్ సర్జన్ మాజీ సొసైటీ అ ధ్యక్షులు పులి ప్రసాదరెడ్డి, పులి అంజిరెడ్డి, , దోసకాయలపాడు సర్పంచ్ఎస్ .వెంకటరామిరెడ్డి , మాజీ జెడ్పీ టీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా యూత్ వింగ్ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగమల్లే శ్వరరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీ విష్ణు, జక్కుల రామకృష్ణ, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు పాలెం నాగలక్ష్మి,గువ్వల వెంకటశ్రీనివాసరెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, సంగు కొండారెడ్డి, మేకల కొండయ్య, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (చందన), మాజీ సర్పంచ్ తూము శివశంకరరెడ్డి, పి.దేవదానం పాల్గొన్నారు.






సంక్షేమ పథకాలు అందించే వారధి వలంటీర్ –
వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ శివ ప్రసాదరెడ్డి
ముఖ్యమంత్రిగా జగన్ లాంటి నాయ కుడు మనకు ఎల్లప్పుడూ ఉండాలని, అలాంటి నాయకుడు పరిపాలనలో సంక్షేమ పథకాలు ప్రజ లకు నేరుగా అందించేందుకు వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారని, అలాంటి వలంటీరే ప్రజలకు, ప్రభుత్వానికి వారధి లాంటి వారని దర్శి నియోజ కవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి తెలిపారు. దొనకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వలంటీర్ వందనం కార్యక్రమం ఎంపీడీఓ వి.వసంతరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. తొలుత జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేప ల్లి వెంకాయమ్మ, శివన్న, ఎంపీపీ బొరిగొర్ల ఉషా మురళి, మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డిలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి చిత్రపటా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివన్న మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టని వలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రంలో మన జగనన్న ప్రవేశ పెట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలి చారని కొనియాడారు. జగనన్న ఎప్పుడూ ముఖ్య మంత్రిగా ఉండాలని, అప్పుడే కుల, మతాలకు సంబంధం లేకుండా పరిపాలన సాగి పోతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పండించిన మిర్చి, పొగాకుకు దళారుల వ్యవస్థ లేకుండా నాణ్యమైన ధర లబిస్తుందని, దీంతో రైతులకు జగనన్నపై నమ్మకం పెరిగిందని గుర్తు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబు అమరావతిని సింగపూర్ చేస్తానని అబద్ధాలు చెప్పటం తో ప్రజలు గద్దె దింపారని ఎద్దేవా చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ వాన వచ్చినా, వరద వచ్చినా జగన్ సైనికులు వలంటీర్లు మాత్రమేనని, ఆయన పెట్టిన పథ కాలు ప్రజలకు దరి చేర్చుతున్నారన్నారు. మళ్లీ జగ నన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. నా బిడ్డ శివన్నను మీరు అన్నా.. అంటారో? తమ్ముడు అంటారో? మీ ఇంటి వద్దకు పంపిస్తున్నా నని, మీరు ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వెంకాయమ్మ పిలుపునిచ్చారు. అనంతరం మండలంలో సేవా రత్న కింద ఎంపికైన రోశయ్య, దేవిలాల్, స్వరాజ్ కుమారి, మనోజ్ ప్రభాకర్, శివయ్యలను బూచేపల్లి వెంకాయమ్మ, శివన్న సన్మానించి సేవా రత్న పథకం అందజేశారు. బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి ట్రస్ట్ ద్వారా వలంటీర్లకు రూ.5 లక్షలు ప్రమాద బీమా కల్పించినట్లు శివన్న తెలి
పారు. మండల ఇన్చార్జి కాపా రమణరెడ్డి, బూచేప ల్లి నందిని, ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి, మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, కర్నాటి ప్రసన్నాంజనేయ రెడ్డి, వైస్ ఎంపీపీ మిట్టా కోటిరెడ్డి, సర్పంచ్ కొంగ లేటి గ్రేస్త్న దేవానంద్, జేసీఎస్ కన్వీనర్ గుంటు పోలయ్య, బత్తుల వెంకట సుబ్బయ్య యాదవ్, ఎం ఎల్ ఓ మార్టిన్, కాలూరి రమణయ్య, కోఆప్షన్ షేక్ గఫార్, ఎంపీటీసీలు గుంటు అమ్మాజీ అజయ్, బం డారు రాజు, తాల్లూరి లక్ష్మీ నగేష్, కసిబిసి నాగ రాజు, గొంగటి పోలిరెడ్డి, పత్తికొండ వెంకట సుబ్బయ్య, వెన్నపూస చెంచిరెడ్డి, చీరాల ఇశ్రాయేలు, ఐలూరి శ్రీనివాసరెడ్డి, పాతకోట కోటి రెడ్డి, దగ్గుల వెంకటేశ్వరరెడ్డి, పిల్లి ఓబులరెడ్డి, గుమ్మా వెంకటేశ్వర్లు, డి.చెంచిరెడ్డి, కోట్ల రమణా రెడ్డి, వజ్రగిరి సొలోమన్ రాజు, రామిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వీరపనేని చెన్నయ్య, విప్పర్ల చిన్న మల్లయ్య, మోషే, తాటిగిరి మదన్, పిక్కిలి అంకయ్య, డోలా చంద్రా, ఎబ్బిలి యర్రయ్య యాదవ్ పాల్గొన్నారు.





