మార్చి మూడో తేదీన మేదరమెట్ల హైవేలో జరిగే సిద్ధం సభను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధమవ్వాలని దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేప ల్లి శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. దర్శి లో వైఎ స్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం సిద్ధం వాలోపోస్ట ర్లను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కురు క్షేత్ర యుద్ధంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని అర్జునుడిలా రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాలు, రైతులు అర్జునుడితో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారన్నారు. సభకు మూడు జిల్లాల నుంచి సుమారు 15 లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నాడు పాదయాత్రలో వైఎస్ జగ న్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన దమ్మున్న సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఐదేళ్ల పాలనలో కరోనా కష్టకాలం వచ్చినా వంకలు చెప్పకుండా చెప్పిన అన్నీ పథకాలు అమలు చేసిన ఘన చరిత్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే నన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజురీయింబర్స్మెంట్, 50 శాతం మహిళ లకు రిజర్వేషన్, వంటి అమలులో సీఎం వైఎస్ జగన్ అభినందనీయుడన్నారు. పేదలకు అన్నీ పథకాలు అందాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్పష్టం చేశారు. కాపా రమణారెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, తూము సుబ్బారెడ్డి, బిజ్జం సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, ఎంపీపీలు సుధా అచ్చయ్య, సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, తాటికొండ శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, ఐడమకంటి వెంకటేశ్వరరెడ్డి, కొరివి ముసలయ్య, బ కా నాగిరెడ్డి, జెడ్పీటీసీలు తాతపూడి రత్నరాజు, నుసుం నాగిరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరె క్టర్ కుమ్మిత అంజిరెడ్డి, నెడ్కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సైదా, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుధా కర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గంగయ్య, జేసీఎస్ కన్వీనర్లు బత్తినేని వెంకటేశ్వర్లు, ఎదురు కోటిరెడ్డి, మేరువ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీలు వీరగంథం కోటయ్య, గోళ్లపాటి మోషే, పోశం మధుసూదన్ రెడ్డి, కోట రామిరెడ్డి, దేవదానం, మాజీ కన్వీనర్లు సూదిదేవర అంజయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘ మాజీ ఉపాధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, ఆంజనేయరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పాశం జయసింహా, ముప్పూరి బ్రహ్మయ్య, శామ్యేల్, నుసుం ప్రతాప్ రెడ్డి, రాచపూడి భాస్కర్ పాల్గొన్నారు.


