ప్రతి కుటుంబంలో ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరమని బొద్దికూరపాడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజరు వి.సంజీవరావు పేర్కొన్నారు. బీకేపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. విద్యా ర్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపసర్పంచి ప్రసాదరెడ్డి , ఎంపీటీసీ బాలకోటయ్య ,పి ఎం సి చైర్మన్ వై కృష్ణారెడ్డి , రిటైర్డ్ హెచ్ఎం ఎస్ అంజిరెడ్డి , రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి యోగి రెడ్డి, ఉపాధ్యాయులు రవి, ధనలక్ష్మి , షేక్ అబ్దుల్ కరీం లలిత, రవి ప్రసాద్ రెడ్డి ఆంజనేయులు, తిరుపతయ్య పోలా బాబు ,స్వరూప రాణి ఉషారాణి, ప్రభాకర్ రావు, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

