తాళ్లూరు మండలంలోని శివరామ పురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక జనరల్ పాఠశాల నందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఎన్.సుబ్బరామిరెడ్డి శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. మద్దిపాడు మండలం గుర్వారెడ్డి పాలెం గ్రామానికి చెందిన సుబ్బరామిరెడ్డి శివరాంపురం పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యా యునిగా విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య కారణంగా ఆయన మృతి చెందడంతో తాళ్లూరు మండల విద్యాశాఖ అధికారి జి. సుబ్బయ్య, యుటిఎఫ్ ఏపీటీఎఫ్ నాయకులు పలువురు సందర్శించి సుబ్బరామిరెడ్డి భౌతికకాయన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఉపాధ్యాయులు జవహర్, నాగిరెడ్డి ,జగదీశ్వరి ,శ్రీనివాస్ వెంకటేశ్వర రెడ్డి, అరుణ తదితరులు ఉన్నారు.
