సోమవారం భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో 2కె వాక్ – బి విజయరావు

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆదేశాల మేరకు రన్ ఫర్ నేషన్ – రన్ ఫర్ మోదీ కొరకు “నారి శక్తి వందన్ మార్ధాన్” కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 8.00 గంటలకు సింగరాయకొండ, పాకాల రైల్వే గేట్ నుండి, పోలీస్ స్టేషన్ వరకు 2 కే. వాక్ జరుగుతుందని భాజపా జిల్లా మహిళామోర్చా ప్రధాన కార్యదర్శి బి. విజయారావు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా బీజేపీ స్టేట్ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షైక్. బాజీ, ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివా రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మలినేని గీతాంజలి పాల్గొంటారని తెలిపారు. కావున ఈ 2కె వాక్ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సెల్ కన్వీనర్లు, కో – కన్వీనర్లు, అసెంబ్లీ కన్వీనర్లు, కో – కన్వీనర్లు, జిల్లా పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, మోర్చా రాష్ట్ర పదాధికారులు, మోర్చా జిల్లా పదాధికారులు, వివిధ సెల్ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, శక్తి కేంద్ర ప్రముఖులందరు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *