భారత రాజ్యాంగంలో స్త్రీలకు అనేక హక్కులు కల్పించిన మహానీయుడు అంబేడ్కర్ – ఎపీ ఎస్సీ కమీషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్- దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సభ నిర్వహణ కబాడి పాలెంలో నూతన అంబేడ్కర్ విగ్రహనికి శంకుస్థాపన – భారీ ర్యాలీ నిర్వహణ – అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

భారత రాజ్యాంగంలో మహిళలకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అండేడ్కర్ అని ఎపీ ఎస్సీ కమీషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. దళిత సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు ఆధ్యక్షతన ఆదివారం రాత్రి దళిత బహుజన సంఘాల అంబేడ్కర్ వాదుల సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఎస్సీ కమీషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ …. భారత రాజ్యాంగం ద్వారా సమన్యాయం. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అను నాలుగు అంశాలపై స్త్రీలకు హక్కులు కల్పిచారు. మనువాదుల పేరున మహిళల స్వేచ్ఛను హరించారు. స్త్రీలకు స్వేచ్ఛ లేదు. సమానత్వం లేదు. భూమి మీద వాటా లేదు, చదువుకునే అవకాశం లేదు, రాజకీయంలో పాల్గొనే అవకాశం లేదని చెప్పారు. భారత దేశంలో స్త్రీ నేడు విదేశాలకు వెళ్తూ, ఉద్యోగాలు చేస్తూ, ఆస్తి సంపాందించుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కల్పించారు. దేశంలో ప్రతి మహిళ పూజించాల్సిన వ్యక్తి మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అనేక హక్కులు కల్పించిన ఘనత బిఆర్ అంబేడ్కర్ దే అన్నారు. శతాబ్దాలుగా విదేశాలలో మహిళలకు సమాన హక్కులు ఉండబట్టే అభివృద్ధి చెందిన దేశాలుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో పరిగణించబడుతున్నాయని అన్నారు. అనేక అంశాలలో మగ వారిని కూడ అధిక మించి మహిళలు ముందుకు వెళ్తున్న విషయాన్ని గమనిస్తున్నామని చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం కావాలని మొదటి రౌండ్ టెబుల్ సమావేశంలో సైతం ప్రతిపాదించినది డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అని అన్నారు. రెండవ రౌండ్ టెబుల్ సమావేశంలో స్వాతంత్ర్యంతో పాటు ఇంకా కావాల్సిన విషయాలలో వయోజనులకు ఓటు హక్కు కల్పించాలని కోరిన మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. సభా అధ్యక్షుడు దళిత సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ కమీషనర్ గా ఒక నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తిని నియమించి ఎంతో మేలు చేసారని అన్నారు. విక్టర్ ప్రసాద్ సారధ్యంలో దళిత సోదరులు అనేక సమస్యలను పరిష్కరించుకోగలిగామని చెప్పారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ, దళిత కళా మండలి రాష్ట్ర కన్వినర్ చిటిమాల సంపత్ కుమార్, అంబేద్కర్ వాది కంకణాల ఆంజనేయులు, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుబ్బారావు, మాల బేరి వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లిపల్లి జోనికుమారి, బీసీ ఐక్యవేదిక బాధ్యులు, న్యాయవాది జాజుల శ్రీనివాసరావులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ మహిళల అభ్యున్నతికి, దేశ ఉన్నతికి చేసిన కృషిని కొనియాడారు. ముందుగా కబడీ పాలెం సర్కిల్లో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం కబడ్డీ పాలెం నుండి బారీ ర్యాలీ నిర్వహించారు. కోలా హోటల్ ఎదురుగా, హెచ్ఎం పాఠశాల వద్ద, అంబేడ్కర్ భవనం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *