తాళ్లూరు మండల కేంద్రంలోని పీహెచ్సీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డిలు ఆదివారం పీహెచ్సీ వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి సమక్షంలో ప్రారంభించారు. పీహెచ్సీ పరధిలో మొత్తం 2210 మంది చిన్నారులకు చుక్కలు వెయ్యాలన్న లక్ష్యం ఉండగా 2187 మందికి వేసి 98.96శాతం సాధించినట్లు వైద్యాధికారి తెలిపారు. కోప్షన్ మెంబర్ కరిమల్లా, కెవీ పాలెం జెసీఎస్ కన్వినర్ విష్ణు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విఠలాపురం సచివాలయంలో సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, మల్కాపురం పంచాయితీలో సర్పంచి షేక్ వలిలు చిన్నారులకు చుక్కలు వేసి పల్స్ పోలియో ప్రారంభించారు.





