సమాజంలో పురుషులతో పాటు మహిళల కూడా సమానమైన స్థానంలో ఉండాలని దానికోసం మహిళలు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ముందుండాలని భావించి మహిళల రక్షణ ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఎన్నో విలువైన పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులులు షేక్ బాజీ పేర్కొన్నారు.
సోమవారం సింగరాయకొండ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి బి విజయ రావు ఆధ్వర్యంలో “రన్ ఫర్ నేషన్ – రన్ ఫర్ మోడీ” పేరిట ఏర్పాటు చేసిన “నారీ శక్తి వందన్ మారథాన్” 2కె వాక్ ను ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ మరియు ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులు పి వి శివారెడ్డి మరియు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మలినేని గీతాంజలి ప్రారంభించారు. పాకాల రైల్వే గేట్ వద్ద ప్రారంభమైన 2కె వాక్ స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ముగించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో పథకాలను రూపొందించారని వానిని ప్రతి మహిళ ఉపయోగించుకొని కుటుంబము ఉంటున్న ఊరు రాష్ట్రము దేశానికి తమ శక్తిని చూపాల్సిన అవసరం ఉందని సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని అదే విధంగా రాజకీయాలలో రాణించాలని ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ల స్ఫూర్తితో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి రవి శంకర్, మహిళా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి, జిల్లా కార్యదర్శి కోటేశ్వరి, జ్యోతి, తిరుమల, కృష్ణవేణి, మద్దు అరవింద లక్ష్మి, సుల్తాన్, లక్ష్మి, అజంతా, కుమారి, ప్రియరాధిక, నాయకులు బాలకోటయ్య, కుంచాల ప్రసాదు, పెరిక లక్ష్మణ్, మహేషు, రాజశేఖర్, వెంకట శివ, అల్లరి రామయ్య, ధనిశెట్టి రాము నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

