ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షురాలు గౌరవనీయ శ్రీ శ్రీమతి పురందేశ్వరి మేడం గారి పిలుపు మేరకు, ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు మరియు జిల్లా అధ్యక్షులు తనికొండ సురేష్ యాదవ అధ్వర్యములో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి చోట్ల బిసి సామాజిక సమావేశాలు, యువ బీసీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు , ప్రకాశం జిల్లా OBC జనరల్ సెక్రటరీ దండు శ్రీనివాసరావుమాట్లడుతూ అన్ని బిసి కులాలను కలుపుకుని, బిసి కులాలతో సామాజిక సమావేశాలు మరియు ప్రతి హాస్టల్ , డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో నూతన బిసి విద్యార్థులతో, యువజన సంఘాలతో సామాజిక సమావేశాలు నిర్వహిస్తున్నమన్నారు.
నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాక ఒబిసి సమాజం అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని , వారి సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని , బీసీలకు అండగా బిజెపి మాత్రమే ఉందన్నారు దండు శ్రీనివాసరావు ,
ఒబిసి కమీషన్ కి చట్టబద్దత చేసి మోదీ ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల కమీషన్ కి రాజ్యాంగ హోదా కలిపించింది కూడా నరెంద్ర మోడి గారే అని, ఒబిసి క్రీమీలేయర్ ఆదాయ ప్రమాణాలు 2017లో 26 లక్షల నుండి 78 లక్షలకు పెంచింది కుడా నరెంద్ర మోడి గారే అని అన్నారు. దండు శ్రీనివాసరావు ,
బిజెపి మోదీజీ ప్రభుత్వంలో ఒబిసిలకు ఐదు కేబినెట్ ర్యాంక్ సహా 27 కేంద్ర మంత్రిత్వ శాఖలు కేటాయించిందని, ప్రభుత్వ రంగంలో OBC కమ్యూనిటీకి సమగ్ర ప్రాతినిధ్యం కలిపించి ఆత్మగౌరవాన్ని కాపాడిందని , మాజీ ప్రధాని శ్రీ చౌదరి చరణ్ సింగ్ , జన్-నాయక్ శ్రీ కర్పూరీ ఠాకూర్ లకు ప్రతిష్టాత్మకమైన భారతరత్నను ప్రదానం చేయడం ద్వారా ఒబిసి గర్వాన్ని పెంచింది కూడా నరెంద్ర మోడి గారే అని దండు శ్రీనివాసరావు అన్నారు ,
కేంద్రీయ విద్యాలయాలలో 27% ఒబిసి రిజర్వేషన్లు , సైనిక్ స్కూల్ లలో ఒబిసి లకు 27%రిజర్వేషన్లు , నవోదయ విద్యాలయాలలో ఒబిసి లకు 27%రిజర్వేషన్లు , లా కాలేజీలలో ఒబిసి లకు 27% రిజర్వేషన్లు , NEET, MBBS,MD సీట్లలో ఒబిసి లకు 27% రిజర్వేషన్లు కలిపించి, రాబోయే కాలంలో బిసి బిడ్డలను డాక్టర్లుగా, సయింటిస్ట్ లుగా , న్యాయమూర్తులుగా, ఇంజినీర్లుగా, కంపెనీల సీఇవోలు గా తీర్చిదిద్దినది కూడా నరెంద్ర మోడి గారే అని, బిసి కుటుంబాలకు ఒక పెద్దన్నగా మోదీజీ ప్రభుత్వం నిలిచిందని దండు శ్రీనివాసరావు అన్నారు ,
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన తో ₹13,000 కోట్లతో 30 లక్షల OBC కుటుంబాలను బలోపేతం చెస్తూ , హస్తకళాల చేతివృత్తులు కాపాడటమే లక్ష్యంగా పని చేస్తోంది కూడా నరెంద్ర మోడి గారే అని, 20,050 కోట్ల రికార్డు కేటాయింపుతో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ఏర్పాటు చేసి చరిత్ర సృష్టిస్తూ , మత్స్యకారులను సంపద సృష్టించేవారిగా తీర్చిదిద్దింది దండు శ్రీనివాసరావు ,
127వ రాజ్యాంగ సవరణతో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒబిసిల జాబితాలను సిద్ధం చేసే అధికారం మోడి కలిపించారని , 2022-23లో OBC వర్గానికి ₹1,083 కోట్ల పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ లు అందించారని దండు శ్రీనివాసరావు అన్నారు ,
నేషనల్ ఫెలోషిప్ కింద HRAలు కాకుండా, OBC విద్యార్థులకు ₹37,౦౦౦, నేషనల్ ఫెలోషిప్ లో SRF కోసం నెలకు ₹42,౦౦౦, నేషనల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు NBCF ద్వారా ఒబిసి లకు పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ఆర్థిక సహాయం కోసం ₹106.28 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేశారని , సంచార , అర్థ సంచార , విముక్త జతుల కొరకు అభివృద్ధి బోర్డ్ ఏర్పాటు చేశారని , సంచార సమాజాన్ని అక్కున చేర్చుకుని వారికి కుడా రాజకీయంగ అభివృద్ది చెస్తూ వారిలో ఆత్మగౌరవాన్ని , ఆత్మస్తైర్యాన్ని కలిపించారు నరెంద్ర మోడి గారే అని దండు శ్రీనివాసరావు ,
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పథకంతో విద్యార్థులకు వడ్డీ రాయితీ, డా. బి. ఆర్ అంబేద్కర్ పథకంతో విదేశాల్లో చదువుతున్న ఒబిసి మరియు EBC విద్యార్థులకు విద్యా రుణాలపై రాయితీ, డా.బి.ఆర్. అంబేద్కర్ పథకంతో మహిళా విద్యార్థులకు 50% నిధులు రిజర్వ్ చేశారని తెలియజేశారు దండు శ్రీనివాసరావు ,
విదేశాలలో ఉన్నత విద్య కోసం అర్హులైన ఒబిసి విద్యార్థులకు మద్దతు తెలిపి , ఒబిసి సాధికారత దిశగా మోదీజీ ప్రభుత్వం పనిచేసున్నదని అన్నారు దండు శ్రీనివాసరావు ,
బిసి సమాజంలో పుట్టిన బిడ్డ ప్రపంచ నాయకునిగా మన ముందు వున్నారని , భారతదేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేస్తున్న నరేంద్రమోడీ బిసి బడుగుబలహీన వర్గాలకు గర్వకారణం అని తెలియజేశారు దండు శ్రీనివాసరావు ,
మరోమారు మోడీ సర్కారు నినాదంతో బిసి సమాజం నరేంద్రమోడీ కి అండగా నిలవాలి అని , ఒబిసి మోర్చా నిర్వహించే సామాజిక సమావేశాలు , హాస్టల్ సమావేశాలను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్త పిలుపు నిచ్చారు .
