2024లో అధికారంలోకి వచ్చేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 175 సీట్లకు 175 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తారని దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి పట్టణంలోని ఐడో వార్డులో మన ఊరు మన శివన్న కార్యక్రమం వార్డు కౌన్సిలర్ తుళ్లూరి బాబూరావు అధ్యక్షతన మంగళ వారం జరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు ఘన స్వాగతం పలి కారు. గడప గడపలో వారి మోగక్షేమాలు అడుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ఎస్సీ కాలనీలో చిన్న టిఫిన్ హోటల్ వద్ద వెంకాయమ్మలు దోశలు పోయగా శివ ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు వాటిని ఆరగించి కాలనీ వాసుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఎంపీపీ సుధాఅచ్చయ్య, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి ,పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్,వైస్ ఎం పీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, , , మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కేవీ రెడ్డి, సాగర్ ప్రాజెక్టర్ మాజీ వైస్ చైర్మన్ సద్ది పుల్లారెడ్డి, సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కేసరి రాంభూపాల్ రెడ్డి, ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు బండి గోపాల్, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, జగనన్నాథం మోహన్ బాబు, ఆవుల జ్యోతి శివారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొడవటి జాన్, సామ్యేల్, వైఎ్సర్ సీపీ సంయుక్త కార్యదర్శి సుశీలా ప్రతాప్, కిషోర్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నపూస బాపిరెడ్డి, ముస్లిం ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు రహమతుల్లా, భాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ మారం శ్రీనివాసరెడ్డి, పుట్ట రవి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానుల పాల్గొన్నారు.








జగనన్నకు రుణపడి ఉంటాం – పట్టాలు పంపిణీ చేసిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ శివప్రసాదరెడ్డి
గత ప్రభుత్వాలు పేద మహిళలను మరిచి కాల యాపన చేశాయని, నేడు జగనన్న ప్రభుత్వంలో పేదల సొం తింటి కలను సాకారం చేశారని, జగనన్నకు రుణపడి ఉం టామని పలువురు లబ్ధిదారులు తెలిపారు. దొనకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ సుజాత అధ్యక్షతన మంగళవారం గ్రామాల్లోని పేదలకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ శాసనసభ్యుడు, ఇన్ చార్జి డాక్టర్ శివప్రసాదరెడ్డి పాల్గొని లబ్ధిదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని సొంతింటి కల నెరవేరిన వారు జగనన్నను మరిచిపోవద్దని వివరించారు. మండలంలో 1175 జగనన్న ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు కాగా అందులో 504 మందికి అధికారులు రిజిస్ట్రేషన్ పత్రాలు అం దజేశారు. ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ …ప్రభుత్వం మహిళలకు నవరత్నాల్లో భాగంగా వందకు వంద శాతం హామీలు నెరవేర్చారన్నారు. 2019 నుంచి నేటి వరకు పేద లకు సొంతింటి కల నెరవేర్చటానికి రెవెన్యూ అధికారులు భూసేకరణ చేసి జగనన్న ఇళ్ల పట్టాలు అందజేశారన్నారు. మీకు రిజిస్ట్రేషన్‌తో పాటు పూర్తి అధికారాలు, సర్వ హక్కులు
ప్రభుత్వం కల్పించిందన్నారు. మండలంలో రూ.120 కోట్లు లబ్ధి పొందారన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ… గ్రామాలకు జిల్లా పరిషత్ నిధుల నుంచి సైడు కాలవలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేసి గ్రామాలు అభివృద్ధి చేశా మన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలను విస్మరించారని, నేడు జగనన్న పేదలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, మళ్లీ మనమందరం ముఖ్యమంత్రిగా జగనన్నను చేసుకోవాలని, అలాగే శివన్నను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని వెంకాయమ్మ కోరారు. అనంతరం మహిళలకు ఇళ్ల పట్టాల రిజి స్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేశారు. ఎంపీపీ బొరిగొర్ల ఉషా మురళి, మండల ఇన్చార్జి కాపా రమణారెడ్డి, స్థానిక సర్పంచ్ కొంగలేటి గ్రేస్త్న దేవానంద్, మాజీ కన్వీనర్ కాకర్ల కృ ష్ణారెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, ఎంపీడీఓ వి.వసంతరావునా యక్, షేక్ గఫార్, గుంటు అజయ్, బండారు రాజు, కాలూరి రమణయ్య, ఎంఎల్ కాలూరి మార్టిన్, భీమినేని వెంకటే శ్వర్లు, యామిని బాలిరెడ్డి, తమ్మనేని సుబ్బారెడ్డి, నాగరాజు, తాల్లూరి లక్ష్మీనగేష్, చెన్నుబోయిన గురుమూర్తి, వెన్నపూస చెంచిరెడ్డి, గోనె జాకోబు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.



