గతంలో ఏ ముఖ్యమంత్రి చేరదీయని విధంగా రాష్ట్రంలోని దళిత, బడుగు బలహీనవర్గాల ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కున చేర్చుకున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. చీమకుర్తి అంబేడ్కర్ నగర్ లో మంగళవారం రాత్రి నిర్వహించిన ఇళ్ల పట్టాలు పంపిణీ, కార్యకర్తల పరిచయ కార్యక్రమం లో మంత్రితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైఎస్సార్సీపీ ఇన్చా ర్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు రూ.25 లక్షల వరకు కార్పొరేట్ వైద్య సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మో హన్రెడ్డికే దక్కుతుందన్నారు. సీఎం అందిస్తున్న సంక్షేమ పథకాలను నిరంతరం పేదలకు అందించాలంటే తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా చేసుకోవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి మేరుగు నాగార్జునను అత్యధిక మెజారిటీతో గెలిపించాల న్నారు. అనంతరం స్థానికంగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులకు మంత్రిని పరిచయం చేశారు. తదుపరి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, డాక్టర్ బీ. జవహర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు గోగినేని వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, స్థానిక కౌన్సిలర్లు తప్పెట బాబూరావు, గోగినేని అనసూర్యమ్మ, నలమల మాణిక్యం, పాటిబండ్ల గంగయ్య, సోమా శేషాద్రి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



